'స్నానానికి వెళ్లిన యువతి మృతి': హాసన్ జిల్లాలో గ్యాస్ గీజర్ లీక్ కలకలం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Karnataka

కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలోని వలలహళ్లి కూడిగే సమీపంలో ఉన్న ఒక లాడ్జ్‌లో బెంగళూరుకు చెందిన ఇరవై మూడేళ్ల వర్ష అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్నానం చేయడానికి వెళ్లిన ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో స్నేహితులు తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. బాత్రూమ్‌లో వెంటిలేషన్ లేకపోవడం, ఎల్పీజీ గ్యాస్ గీజర్ నుంచి కార్బన్ మోనాసైడ్ వెలువడి ఊపిరాడక మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి తల్లి అనుమానాలు వ్యక్తం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.