గణేష్ నిమజ్జన ఊరేగింపును స్వయంగా పర్యవేక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: అశోక్
స్థలం: సిద్దిపేట
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న గణేష్ నిమజ్జన ఊరేగింపును రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులను డీజీపీ సీవీ ఆనంద్, నాయకులు అధికారులతో కలిసి స్వయంగా పర్యవేక్షించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం మరియు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.