బిగ్ బాస్ హౌస్లో మిథిలేష్ ఎపిసోడ్ పై త్రిగున్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ హౌస్లో పదిహేను లక్షల నగదు తీసుకొని మిథిలేష్ బయటకు వెళ్లడంపై కంటెస్టెంట్ త్రిగున్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి డబ్బులు కట్ చేయడం సరికాదని మండిపడ్డారు. మిథిలేష్ నిర్ణయానికి మద్దతు తెలిపిన అమన్ తీరును తప్పుపడుతూ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిణామంతో హౌస్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని, కంటెస్టెంట్ల మధ్య గొడవలు ముదిరేలా ఉన్నాయని తోటి సభ్యులు పేర్కొన్నారు.