నెల్లూరులో అదృశ్యమైన పదిమందిని గుర్తించిన ఏహెచ్‌టీయూ ప్రత్యేక బృందం

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో అదృశ్యమైన మహిళలు, బాలికల కేసులపై ఏహెచ్‌టీయూ ప్రత్యేక దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో నెల రోజుల్లోనే పది మిస్సింగ్ కేసులను ఛేదించింది. వింజమూరు, అనికేపల్లికి చెందిన బాలికలు, యువతులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. మహిళలు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అదృశ్యమైన వారిని వెతికి పట్టుకోవడమే లక్ష్యమని డీఎస్పీ వేమారెడ్డి స్పష్టం చేశారు.