'తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి': రాజపేట పీఎస్లో రెడ్డి సంఘం నేతల ఫిర్యాదు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో తెలంగాణ రెడ్డి సంఘం నేతలు మంగళవారం చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు. క్యూ న్యూస్ వేదికగా సెప్టెంబర్ 5న నకిరేకల్ సభ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. రెడ్లపై అసభ్యకరంగా, అవమానకరంగా దూషించారని వారు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో వైషమ్యాలు పెంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేక సోమిరెడ్డి, విఘ్నేశ్వర్ రెడ్డి, ఆర్ రవీందర్ రెడ్డి, ఆర్ భాస్కర్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.