భారీ వరద ముప్పు: పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఎంపీ పుట్టా మహేష్ హెచ్చరిక

రిపోర్టర్: అశోక్ స్థలం: ఏలూరు

పెద్దవాగుకు భారీగా వరదనీరు చేరుతున్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. ఏలూరులోని తన కార్యాలయం నుంచి అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు ఆయన తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.