కెమిస్ట్రీ సినిమా: ధ్రువ సర్జా సరసన నటిస్తున్న హీరోయిన్ నభా నటేష్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

హీరోయిన్ నభా నటేష్ కొత్త సినిమా కెమిస్ట్రీ టైటిల్ గ్లింప్స్ విడుదలైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రిన్స్ ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు విశాల్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధ్రువ సర్జా, నభా నటేష్ జంటగా అలరించనున్నారని, ఈ ఫ్రెష్ పెయిర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.