క్రేజీ కల్యాణం చిత్రం నుంచి 'కాకా ధూమ్ ధమాకా' సాంగ్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'క్రేజీ కల్యాణం' చిత్రం నుంచి 'కాకా ధూమ్ ధమాకా' లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి మాస్ ట్యూన్ అందించగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. పెళ్లి భరాత్ నేపథ్యంలో సాగే ఈ ఎనర్జిటిక్ సాంగ్‌లో అనుపమ పరమేశ్వరన్ వేసిన మాస్ స్టెప్స్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.