తమిళనాడు సీఎం విజయ్ రాకతో విజయవాడ దద్దరిల్లిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాకతో విజయవాడ దద్దరిల్లిందని, ఆయన తొలిసారి ఏపీకి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలో భేటీ అనంతరం పున్నమిఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్లో ఇద్దరు సీఎంలు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. పార్టీ పెట్టిన రెండేళ్లకే విజయ్ సీఎం అయ్యారని చంద్రబాబు ప్రశంసించారు. దుర్గమ్మ ఆశీస్సులతో గోదావరి-కావేరి అనుసంధానం జరుగుతుందని ఆకాంక్షించారు. 2047 నాటికి భారత్ నంబర్వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.