నెల్లూరులో మేయర్ సుజాత ఆకస్మిక పర్యటన, సమస్యల పరిష్కారానికి ఆదేశం

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత 53వ డివిజన్‌లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని, ఇంటింటి చెత్త సేకరణలో తడి, పొడి చెత్తను వేరుగా అందించాలని ప్రజలను కోరారు. పెండింగ్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.