కేబీఆర్ పార్క్ వద్ద గుంతను పూడ్చిన యాచకుడు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ ప్రధాన రహదారిపై ఏర్పడిన ప్రమాదకర గుంతను ఓ యాచకుడు తనవంతు బాధ్యతగా మట్టితో పూడ్చాడు. వాహనదారులు కిందపడి ప్రమాదాల బారిన పడకుండా స్పందించి గుంతను పూడ్చడం పట్ల స్థానికులు అతడిని ప్రశంసిస్తున్నారు. అధికారులు మాత్రం దీనిని పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.