మురసు తుపాను ప్రభావం: పలు జిల్లాల్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా
రిపోర్టర్: రాజేష్
స్థలం: తూర్పు గోదావరి
ఆంధ్రప్రదేశ్ లో మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోందని, భారీ వర్షాల కారణంగా తూర్పు గోదావరి మరియు ఏలూరు జిల్లాల్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. గోపాలపురం తో పాటు వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కొయ్యలగూడెం మండలాల్ లో పోలింగ్ నిలిచిపోయిందని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వాయిదా పడిన గోపాలపురం మండలంలో నవంబర్ ఆరో తేదీన పోలింగ్ నిర్వహిస్తామని, మిగిలిన ప్రాంతాల్ లో ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.