పెరుగుతున్న ధరలతో నిరుపేదల బతుకులు చితికిపోతున్నాయి

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించడంలో విఫలమయ్యాయని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్ విమర్శించారు. వేలేరుపాడు మండలం కన్నాయిగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉల్లిపాయలు, టమాటాలు, పప్పులు, బియ్యం, వంటనూనెల ధరలు పెరగడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోందన్నారు. కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ ప్రజలపై ధరల భారాన్ని మోపడం సరైన పద్ధతి కాదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.