ట్రంప్, నెతన్యాహు టెలిఫోన్ సంభాషణ: ఇరాన్ పై సైనిక చర్యకు సన్నాహాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్ లో మాట్లాడినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఇరాన్ పై సైనిక చర్యను పునరుద్ధరించే అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అయితే దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. మరోవైపు ఈ పరిణామంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.