రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు: పుత్తూరులో ఎమ్మెల్యే భాను ప్రకాష్ పంపిణీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
పుత్తూరు రూరల్ మండలం ఉత్తరపు కండ్రిగ రెవెన్యూ గ్రామానికి చెందిన రైతులకు నగర శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ అధికారికంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు, రైతులు ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.