టెలివిజన్ రంగంలో విషాదం: సీఐడీ సృష్టికర్త బీపీ సింగ్ కన్నుమూత
రిపోర్టర్: సురేష్
స్థలం: Mumbai
ప్రముఖ టెలివిజన్ నిర్మాత, సీఐడీ ధారావాహిక సృష్టికర్త బి.పి. సింగ్ గుండెపోటుతో కన్నుమూశారని ప్రముఖ చలనచిత్ర నిర్మాత అశోక్ పండిట్ తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిఐడి, ఆహత్ వంటి గొప్ప కార్యక్రమాలతో ఆయన దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారని నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయానికి త్వరలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.