ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన ఎజెండానంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ

రిపోర్టర్: సతీష్ స్థలం: కొచ్చి

యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2026లో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత కలల సాకారం కోసమే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. డీఎస్సీ ప్రక్రియపై రాజకీయ నిరుద్యోగులే పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని, తాము ఇస్తున్న సర్టిఫికెట్లన్నీ గత ప్రభుత్వ హయాంలోనివేనని ఆయన తిప్పికొట్టారు.