చౌటుప్పల్ జాతీయ రహదారిపై వాహనదారుల నరకయాతన
రిపోర్టర్: హరి
స్థలం: Choutuppal
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు విస్తరణ మరియు అండర్ పాస్ వంతెనల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు మూడు వందల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో నిత్యం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి పనుల వేగం పెంచాలని వారు డిమాండ్ చేశారు.