ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
దేశంలో ప్రత్యేక సవరణ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం తీరును ఇండియా కూటమి నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్షాలన్నీ ఏకమై పోరాటం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.