ప్రజల భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉన్నామన్న తిరుపతి పోలీసులు
రిపోర్టర్: శివ
స్థలం: తిరుపతి
ప్రజల రక్షణే ధ్యేయంగా తిరుపతి పోలీసులు అప్రమత్తంగా విధి నిర్వహణ చేపడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం గమనిస్తూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి పోలీస్ శాఖ అధికారికంగా వెల్లడించింది. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు భరోసానిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. పౌరులు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని, ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు.