నామినేటెడ్ పదవుల భర్తీపై దసరా ఆశలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా పీసీసీ కసరత్తు చేస్తున్నా నియామకాలు పూర్తికాకపోవడంతో క్యాడర్లో నిరాశ అలుముకుంది. కనీసం ఈ దసరా పండుగ నాడైనా పదవులు దక్కుతాయని ఆశ పడుతున్నారు. ఢిల్లీ నుంచి జాబితా వచ్చినా ఆలస్యం చేయడం తగదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.