చిల్డ్రన్ మూవీగా వస్తున్న సమ్మర్ హాలిడేస్: నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
బాలల జ్ఞాపకాల నేపథ్యంలో తెరకెక్కిన సమ్మర్ హాలిడేస్ సినిమా నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుందని నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా స్వచ్ఛమైన భావోద్వేగాలతో పాటు అందరినీ అలరించే వినోదాన్ని అందిస్తుందని దర్శకుడు శ్రీకర్ వెల్లడించారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.