పోచంపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

రిపోర్టర్: సునీల్ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పోచంపల్లి పట్టణంలోని పర్యాటక పార్కును సందర్శించి, ఎక్స్పీరియన్స్ పోచంపల్లి కార్యక్రమంలో ఎంపికైన గైడ్లు, చేనేత కార్మికులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకట రెడ్డితో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో రీ-సర్వే, ఎస్ఐఆర్ ప్రక్రియలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారని కలెక్టర్ యాదాద్రి భువనగిరి వెల్లడించారు. ఈ పర్యటనలో పర్యాటక వసతులు, క్షేత్రస్థాయి సమస్యలపై వివిధ అంశాలను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.