రూ.3 కోట్లతో చిమ్మిర్యాలలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన రాజ్ గోపాల్ రెడ్డి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: సంస్థాన్ నారాయణపూర్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం చిమ్మిర్యాల గ్రామంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ముప్పైమూడు బై పదకొండు కేవీ సబ్ స్టేషన్ను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు అత్యంత వెనుకబడిన ప్రాంతమని, రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.