తెలంగాణలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం తదితర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.