వైకాపా ద్వంద్వ ప్రమాణాలపై తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, అందుకే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సైతం దీనిపై ప్రశ్నించడం లేదని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఈసీపై కాంగ్రెస్, వైకాపా పార్టీలు బురద చల్లడాన్ని అలవాటుగా మార్చుకున్నాయని ఆయన మండిపడ్డారు. సర్పై అనుమానాలుంటే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎందుకు హైకోర్టును ఆశ్రయించారని ఆయన ఎక్స్ వేదికగా నిలదీశారు.