ఓబులవారిపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన పట్టి కవిత

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లి

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని పలు గ్రామాల్ లో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కీర్తి పట్టి కవిత విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో టీడీపీ సీనియర్ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి పాల్గొని అభ్యర్థి గెలుపు కోసం శ్రమించారు. ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరుతూ భారీ మద్దతును కూడగట్టారు.