ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపులో ఆంధ్రప్రదేశ్ కు ప్రథమ స్థానం

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపులో ఆంధ్రప్రదేశ్ కు ప్రథమ స్థానం దక్కిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి వర్క్ షాప్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, రాష్ట్రాలకు సీఎం అవార్డులు అందజేశారు. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అనుగుణంగా మన పాలనా వ్యవస్థలు విప్లవాత్మక మార్పులను సంతరించుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.