'30 తులాల బంగారం స్వాధీనం': కర్నూలులో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కర్నూలు

కర్నూలులో వరుస చోరీ కేసులను స్థానిక పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సీసీటీవీ టేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితురాలి వద్ద నుంచి సుమారు 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీస్ బృందాలను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందిస్తూ రివార్డులు అందజేశారు.