విశాఖపట్నంలో మెడికో శైలజ ఆత్మహత్యతో తీవ్ర విషాదం
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలోని రామ్‌నగర్‌లో ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని శైలజ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువు ఒత్తిడి కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.