తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు అత్యున్నత రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున ఐదు రోజుల పాటు అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. సోమవారం నుంచి పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. తీర ప్రాంత ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు.