పొదలకూరు పోలేరమ్మ జాతరకు మాజీ మంత్రి కాకాణికి ఘనంగా ఆహ్వానం
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అక్టోబర్ 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా జాతర మహోత్సవాలకు విచ్చేయాల్సిందిగా మాజీ మంత్రి వర్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి పెద్దకాపు మరియు ఆలయ భక్తబృందం సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన కాకాణి ఉత్సవాల్లో తప్పకుండా పాల్గొంటానని ఆలయ నిర్వాహకులకు స్పష్టం చేశారు.