2047 నాటికి రాష్ట్రంలో పచ్చదనం పెంచుతాం: నాగబాబు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పార్వతీపురం మన్యం
పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 2047 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.