చైనాలో సెప్టెంబర్ 23న షావోమి 18 ప్రో సిరీస్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: China

ప్రముఖ టెక్ దిగ్గజం షావోమి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌గా షావోమి 18 ప్రో సిరీస్‌ను చైనాలో సెప్టెంబర్ 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో షావోమి 18 ప్రో, షావోమి 18 ప్రో మాక్స్ మోడళ్లు రానుండగా, వెనుక భాగంలో సెకండరీ డిస్‌ప్లే, హార్డ్‌వేర్ ఆధారిత ప్రైవసీ ఫీచర్ మరియు 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి.