స్తంభాద్రి యూత్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఘనంగా మహా అన్నదానం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నరసింహస్వామి గుడి సమీపంలో శ్రీ స్తంభాద్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానాన్ని ఏసీపీ రమణమూర్తి ప్రారంభించారు. గత ఇరవై ఆరు ఏళ్లుగా దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మతసామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.