పురపోరు కౌంటింగ్ కు సర్వం సిద్ధం: మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: Amaravati
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని, ఐడీ కార్డులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రాత్రికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు.