నడివీధి గణనాథుని సన్నిధిలో వైభవంగా కుంకుమార్చన పూజలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని నడివీధి భాయి సెంటర్లో గణేశుని మండపంలో నవరాత్రుల సందర్భంగా అర్చకులు సాయికుమార్ శర్మ ప్రత్యేక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మెత్తల శివ దంపతులు ఉభయదాతలుగా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించారు. గణనాథుని దర్శనానికి స్థానిక యువకులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తిపారవశ్యంతో సందడిగా మారింది.