మహారాష్ట్రను ఒప్పించాల్సిందే: తుమ్మిడిహెట్టిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

రిపోర్టర్: కిరణ్ స్థలం: Suryapet

మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ముంపు లెక్కలు, పరిహార నిధుల జాయింట్ అకౌంట్ తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ రాష్ట్రం అడిగిన వివరాలన్నీ పారదర్శకంగా అందించాలని, 152 మీటర్లు కుదరకపోతే 150 మీటర్ల మేర ప్రత్యామ్నాయాలపై కూడా తక్షణమే దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.