ఆసియా క్రీడలకు భారత స్విమ్మింగ్ జట్టుకు వేదాంత్ మాధవన్ నాయకత్వం
రిపోర్టర్: నరేష్
స్థలం: India
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ 2026 ఆసియా క్రీడలలో 12 మంది సభ్యుల భారత స్విమ్మింగ్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరిగే ఈ టోర్నీలో శ్రీహరి నటరాజ్, సాజన్ ప్రకాష్‌లతో కలిసి ఆయన బరిలోకి దిగుతున్నారు. భారతీయులు జన్మనా ఎంతో ప్రతిభావంతులని, అయితే సరైన ఆహారపు అలవాట్లు, ప్రోటీన్ లోపం వల్ల అథ్లెట్లు వెనుకబడుతున్నారని వేదాంత్ అభిప్రాయపడ్డారు.