ఢిల్లీలో సీఎం చంద్రబాబు కీలక భేటీలు: రైల్వే అభివృద్ధిపై ప్రత్యేక చర్చ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రత్యేకంగా చర్చించినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణకు రూ.10,047 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. విశాఖ నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలు నడపాలని కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.