మన్ననూరులో అదుపుతప్పి అంబేద్కర్ విగ్రహ దిమ్మెను ఢీకొన్న కారు.. పలువురికి స్వల్ప గాయాలు

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అమ్రాబాద్

శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై అమ్రాబాద్ మండలం మన్ననూరు అంబేద్కర్ చౌరస్తాలో ఘోర ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.