నన్ను రెచ్చగొడితే వైసీపీకి తీవ్ర నష్టం తప్పదు: విజయసాయి రెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

వైసీపీలోని కోటరీ కుట్రల వల్లే తాను పార్టీకి దూరమయ్యానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నుంచి రెండేళ్లుగా ఫోన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నమ్మకద్రోహిగా ముద్ర వేసి రెచ్చగొడితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని, తగిన సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు బయటపెడతానని ఘాటుగా హెచ్చరించారు.