గుర్తుతెలియని శవాన్ని దహనం చేయడంలో పోలీసుల నిర్లక్ష్యంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: Delhi

గుర్తుతెలియని మృతదేహాన్ని ప్రాథమిక గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండానే దహనం చేయడంపై గురుగ్రామ్ పోలీసుల నిర్లక్ష్యంపై ఢిల్లీ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ Rahul Jain తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించారనే అనుమానం ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని గురుగ్రామ్ డీసీపీని ఆదేశించడంతో పాటు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడికి సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.