ప్రాథమిక తాగునీటి సమస్యపై పాలకుల ఉదాసీన వైఖరి
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
వెదురుకుప్పం మండలంలోని పలు గ్రామాల్లో గత నెల రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వైఎస్సార్సీపీ నాయకులు పి. నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలయ్యపల్లి పంచాయతీతో పాటు ఎస్టీ కాలనీలో పేదలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ట్యాంకర్ల ద్వారా తాత్కాలిక సర్దుబాటు కాకుండా, రాజకీయాలకు అతీతంగా శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని ఆయన కోరారు.