మద్యం కుంభకోణం కేసులో రాజ్ రెడ్డికి బెయిల్ మంజూరు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి మరియు వాసుదేవ రెడ్డిలకు నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులు విచారణకు సహకరించాలని, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాస్‌పోర్టుల సమర్పణతో పాటు విచారణాధికారులకు అందుబాటులో ఉండాలని కఠిన నిబంధనలు విధించింది.