'ప్రజా పాలన దినోత్సవం': కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ విలీన వేడుకలు

రిపోర్టర్: సతీష్ స్థలం: కరీంనగర్

తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, నాయకులతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో విలీనమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు.