పాస్ పోర్ట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ కేంద్రంపై కేఏ పాల్ ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
పాస్‌పోర్ట్ రెన్యూవల్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం త్రీగా అడ్డుకుంటోందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం వద్ద ఆయన వీడియో విడుదల చేస్తూ, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తనకు మంచి మిత్రులే అయినప్పటికీ పాస్‌పోర్ట్ ఇవ్వకపోవడం షాకింగ్‌గా ఉందని మండిపడ్డారు. విజయనగరం ఎఫ్ఐఆర్ పేరుతో తనకు పాస్‌పోర్ట్ నిరాకరిస్తే తాను నోరు విప్పాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.