నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయని దద్దమ్మ ప్రభుత్వం ఇది
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
శ్రీశైలంలో నీళ్లున్నా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు అని విమర్శించింది. కల్వకుర్తి ప్రాజెక్టులో ఐదు మోటార్లు ఉంటే కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఆన్ చేసి, అది కూడా పగటి పూట మాత్రమే నడుపుతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించింది.