అమెరికాలో అణుప్రమాదం కలకలం: పరిశోధనా కేంద్రంలో చెలరేగిన మంటలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: సౌత్ కరోలినా
అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలోగల యూఎస్ ఇంధన శాఖకు చెందిన అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీ గదిలో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రేడియేషన్ లీకై ఉండొచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సిబ్బంది రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయట ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.