రాజకీయ సంచలనం: నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ

రిపోర్టర్: సురేష్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘాన్ని తెలుగుదేశం పార్టీ సునాయాసంగా కైవసం చేసుకుందని, మున్సిపల్ ఛైర్మన్గా డాక్టర్ ఆవుల గోవిందరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం ముప్పై రెండు వార్డులకు గాను ఇరవై ఏడు వార్డులు ఏకగ్రీవం కావడంతో కౌన్సిల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిపత్యం లభించిందని నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఈ ఘన విజయానికి కారణమని శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.